
రణం న్యూస్ కోరుట్ల, ఏప్రిల్ 11:
చిరుధాన్యాలతో శారీరక ఆరోగ్యం సాధ్యమని అంగన్ వాడి సూపర్ వైజర్ ఏ. భారతి అన్నారు. పోషక పక్షంలో భాగంగా శుక్రవారం కోరుట్ల పట్టణంలోని హాజీపూర్ 2 అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలపై ఆమె పరిపూర్ణ అవగాహన కల్పించారు. స్థానిక ఆహార పదార్థాలు మనకు చౌక ధరలో దొరికే ఆహార పదార్థాలను ఉపయోగించుకోవాలని సీజనల్ పండ్లు కూరగాయలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పుష్పలత, ఆశాలు పాల్గొన్నారు