మీడియా కథనాలు.. ఊహాగానాలు… నిజమేనా..
నిందితుల అరెస్ట్ రిమాండ్ నిర్దారణ కాకముందే గుప్పు మన్న వార్తలు
లోతైన విచారణకు భంగం కలిగినట్లు అధికారుల అసహనం..?
రణం న్యూస్ కోరుట్ల:జులై 8
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లో శనివారం సాయంత్రం ఐదు ఏళ్ళ చిన్నారి హితిక్ష హత్య అమానుష అమానవీయ ఘటన పట్టనాన్నే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.పాప తల్లిదండ్రుల బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని పాశవికంగా హత్యచేసిన మానవ మృగం ఎవరు,హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పీ రాములు,కోరుట్ల మెటపల్లి సిఐ లు సురేష్ బాబు,అనిల్ లు కోరుట్ల మేడిపల్లి కథలపూర్ మెటపల్లి ఎస్ ఐ చిరంజీవి ,శ్యామ్ రాజ్ ,కిరణ్ ,నవీన్ లతో సహా జిల్లా పోలీసు యంత్రాంగం , డాగ్ స్కాడ్ , విచారణ మొదలు పెట్టి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారని,తెల్లవారేసరికి సుమారు పదుల సంఖ్యలో మందిని విచారించినట్లు నిందితులను పట్టుకున్నారనే వార్తలు తెల్లవారేసరికి గుప్పుమన్నాయి. కానీ ఎక్కడ కూడా వీరు నిందితులు అని పోలీస్ లు నిర్ధారించలేదు. చిన్నారి హత్యకు గల కారణాలు ఏ అధికారి వెల్లడించలేదు.కానీ ప్రచార మాధ్యమాల్లో లలో ప్రచురించాయి. శనివారం సాయంత్రం హత్య జరగగా ఆదివారం ఉదయం 10 గంటలకే పాప ను హత్య చేసింది తన సొంత పిన్ని మమత అనే విషయం దావానంలా వ్యాపించడం అవి చాలా పత్రికకలు ఛానెల్ ప్రచురించడం పోలీస్ ల విచారణ కు భంగం కలిగించాయి అనే వాదనలు ఉన్నాయి.అదే తరహాలో నింధితురాలును రిమాండ్ కు తరలించారని సోమవారం సాయంత్రము ఐదు గంటలకు వచ్చిన వార్తలను పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ లో గాని ప్రెస్ నోట్ ద్వారా కానీ వెల్లడించలేదు.చట్టప్రకారం విచారణ జరుపే క్రమంలో పోలీస్ అదుపులో ఉన్న నిందితులను 24 గంటల్లోపు న్యాయ స్థానములో ప్రవేశ పెట్టాలనే నిబంధనలు ఉన్నాయి.అలాంటి లోతైన విచారణకు ప్రచార మాధ్యమాలు భంగం కలిగింఛాయని న్యాయనిపుణుల చెప్పుకొస్తున్నారు.

రాత్రంతా ఎస్పీ తో సహా పోలీస్ టీమ్ విచారణ చేస్తూనే ఉన్నారు
హత్య జరిగిన రోజే.. అత్యంత వేగంగా స్పందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పీ అడ్లూరి రాములు టీం రాత్రంతా నిద్రపోకుండా తమదైన శైలిలో దర్యాప్తు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.పక్కా హత్యా నిందితులు ఫలానా వాళ్లేనని నిర్థారణకు వచ్చినప్పటికీ.. ఇంకా లోతైన విచారణ కారణంగా ‘హంతకురాలి’ అరెస్టును అధికారికంగా పోలీసులు ప్రకటించలేదని తెలుస్తోంది.నిజంగా హంతకురాలు ఆమెనే నా.? ఇంకా ఎవరైనా ఉన్నారా.? అసలు ఈ హత్యోదంతం వెనుక ఎవరెవరున్నది తేలాలంటే..ఆ మిస్టరీ వీడాలంటే.. సమగ్ర దర్యాప్తు వివరాలు పోలీసులు అధికారికంగా చెబితేగాని చిక్కుముడి వీడేలా లేదన్నది సుస్పష్టం
