
- భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు
- పలుచోట్ల అన్నదానాలు
రణం న్యూస్ , కల్చరల్ : అఖిలభారత పద్మశాలి కుల బాంధవులు, కాశిబుగ్గ మిత్రమండలి ఆధ్వర్యంలో శనివారం కాశిబుగ్గ చౌరస్తాలో శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కండేయుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 3000 మందికి అన్న ప్రసాద వితరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు గుండు ప్రభాకర్, ఆడెపు రవీందర్, సాంబారి సమ్మారావు, గుండేటి నరేంద్ర కుమార్, వడ్నాల నరేందర్, భయ్యా స్వామి, గుల్లపల్లి రాజకుమార్, గుండేటి కృష్ణమూర్తి, గోరంట్ల మనోహర్, ముల్క సురేష్, వేముల నాగరాజు, వంగరి రాంప్రసాద్, క్యాతం రంజిత్, మాటేటి విద్యాసాగర్, ఆడెపు సదానందం, సాంబారి మల్లేశం, వంగరి రవి, దాసి శివకృష్ణ, దుస్సా కృష్ణ, కుసుమ సారంగపాణి, మండల చందు, కోడం శరత్, మామిడి ఈశ్వరయ్య, బండారి శ్రీనివాస్, ఆకేన వెంకటేశ్వర్లు, కాశీబుగ్గ పద్మశాలి కుల బాంధవులు, కాశీబుగ్గ మిత్రమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ట్రస్టు భవనంలో..
శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని పద్మశాలి సేవా సంఘం ట్రస్టు భవనంలో ట్రస్ట్ అధ్యక్షులు సుంకనపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తమార్కండేయుడి ఆశీస్సులు సదా ఉండాలన్నారు. పద్మశాలీలంతా ఐకమత్యంగా ఉంటూ ఫిబ్రవరి 2న జరుగనున్న బీసీ రాజకీయ యుద్ధభేరికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోషికొండ సుధాకర్, గోరంటాల రాజు, ఆకెన వెంకటేశ్వర్లు, బైరి మురళీకృష్ణ, స్వర్గం దశరథం, కోమాకుల నాగరాజు, బింగి మహేష్, గాదే ప్రభాకర్, చిలుపూరి మల్లేశం పాల్గొన్నారు.
పద్మశాలి సంఘంలో..
కరీమాబాద్ పద్మశాలి సంఘంలో శనివారం మార్కండేయ జయంతిని అధ్యక్షుడు గోరంటల సాంబయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎలగొండ రవి, కోశాధికారి కోడం హరి, కమిటీ సభ్యులు పత్తిపాక సాంబాశివుడు, మాటేటి దిలీప్, గుడిమల్ల నరేష్, ఆడెపు శోభరాణి, తేలు అరుణ, గోరంటల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్ లో..
కరీమాబాద్ గుండు బావుల ప్రాంతంలోని పద్మశాలి పరపతి సంఘం అధ్యక్షుడు వంగరి భిక్షపతి ఆధ్వర్యంలో శనివారం మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 400మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వంగరి రాజు, వెన్నం శ్రీనివాస్, మాచర్ల రవి, పుట్ట భోగేశ్వర్, చిలువేరు రవీందర్, బత్తిని సాంభయ్య, కందగట్ల శ్రీనివాస్, మామిడాల ఉమేష్, వంగరి శ్రీనివాస్, కొంగ గణేష్, వంగరి సాంభమూర్తి, వంగరి హరి, సామయల సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ కాలనీ లో..
భక్త మార్కండేయ మహర్షి జయంతి సందర్బంగా మార్కండేయ కాలనీ (మంగలి కుంట)లో నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుండు శ్రీనివాస్, కోతం సంగీత్, చిప్పా వెంకటేశ్వర్లు, కాశేటి వేణు, బూర వేణు, బూర రమేష్, చిలుక శ్రీధర్, దుబాసి అశోక్, ముండ్రాతి అనిల్, కొంగ రవి, బండి శ్రీనివాస్, రాచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.