శుభాకాంక్షలు తెలిపిన బి సి యువజన సంఘం రాష్ట్ర నాయకులు షికారి గోపికృష్ణ

రణం :న్యూస్ జగిత్యాల: ఆగస్ట్ 23,తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కి నిరంతరం కృషి చేసిన మహనీయులు బి ఎస్ రాములు అని బి సి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ పాత్రికేయులతో మాట్లాడుతూ అన్నారు. నేడు శనివారం రోజున జగిత్యాల పట్టణము లోని ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ పి జీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బి సి కమిషన్ మొట్ట మొదటి చైర్మన్ బి ఎస్ రాములు జన్మదినం పురస్కరించుకొని బి సి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం గోపికృష్ణ మాట్లాడుతూ రాములు సర్ జన్మదినం లో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ రాములు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, బి సి ల స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ల సాధనకై తమ వంతుగా కృషి చేయాలని వారిని ఈ సందర్భంగా కోరారు .ఇట్టి జన్మదిన వేడుకల కార్యక్రమంలో ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ , పి జీ కళాశాలల సంయుక్త ప్రిన్సిపాల్ అశోక్ బి సి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్ బి సి యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు .

