రణం న్యూస్, మేడిపల్లి మండలం, జులై 5:

వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో సాకారం అయినా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలకి అవసరమైనా సంస్థగత నిధి(కార్పస్ ఫండ్) కోసం
దోసిలి ఫౌండేషన్ ద్వారా 50,000 శనివారం రోజున సింగిరెడ్డి దోసిలి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి కళాశాల అభివృద్ది కమిటీని కలిసి అందచేశారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ
ఈ ప్రాంత చిరకాల వాంఛ నెరవేర్చిన నాయకులు ఆది శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపి,
గ్రామీణాభివృద్ధి కి విద్యానే ముఖ్యకారణం, ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు కావడం ద్వారా పేద,మధ్య తరగతి వర్గాల విద్యార్థులకి లాభం చేకూరుతుంది అన్నారు. భవిష్యత్తు లో మన కళాశాల అన్ని విధాలా అభివృద్ధికి సింగిరెడ్డి దోసిలి ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల చైర్మన్ మార్గం నర్సారెడ్డి ,వైస్ చైర్మన్ పుల్లూరి దేవయ్య , కాలేజ్ కమిటీ సభ్యులు అంగడి ఆనందం, చేపూరి నాగరాజు, ల మాజీ సర్పంచ్ బొంగుని రాజగౌడ్, ఎడమల రాజేందర్ రెడ్డి కాలేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.