రణం న్యూస్ కోరుట్ల:జులై8


జగిత్యాల జిల్లా కోరుట్ల గౌడ సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని స్థానిక జి ఎస్ గార్డెన్ లో శుక్రవారం ఎన్నుకున్నారు.సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈ కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు.అధ్యక్షులుగా కొండ కిషన్ గౌడ్ ను,ఉపాధ్యక్షులుగా సూదవేణి రవి గౌడ్ ను,కార్యదర్శి గా కుంట రాజగౌడ్ ను,కోశాధికారిగా పడాల ప్రకాష్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు పడాల నారాయణ గౌడ్ ,కుంట నారాయణ గౌడ్ పర్యవేక్షణలో నిర్వహించారు.ఎన్నికల అధికారులుగా తూడూరి సురేష్,యాగండ్ల గంగాధర్ లు వ్యవహరించారు.ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష కార్యవర్గం సంఘ సంక్షేమానికి,భవన నిర్మాణానికి స్థలం కోసం కృషి చేస్తామని తెలిపారు.
