రణం న్యూస్ కోరుట్ల:జనవరి 16,

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకుఎనలేని అభిమానం ఉందని,దేశ విదేశాల్లో కూడా పార్టీ అభిమానులు ఉన్నారని నిరూపితమవుతున్నది.కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి అభ్యర్థి గా తనకు టికెట్ కేటాయించాలని ప్రవాస భారతీయుడు ఖతార్ (గల్ఫ్) దేశం నుండి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జికు ధరకాస్తూ చేసుకున్నాడు.. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన పురాణం నాగరాజు 29వ వార్డు కు పార్టీ టికెట్ తనకు కేటాయించాలని పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు కు కాంగ్రెస్ పట్టణ పట్టణ అధ్యక్షులువ తిరుమల గంగాధర్ ద్వారా ధరకాస్తూ చేసుకున్నారు. తన సోదరుడి తో ఈ దరఖాస్తు పంపించానని,గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పనిచేశానని తనకు ఈ బల్దియా ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నాగరాజు తెలిపారు.

