గంజాయి రహిత కోరుట్ల మా ద్యేయం…కోరుట్ల పోలీస్…
ఏళ్లుగా కానీ గంజాయి కేసులు.. రెండు నెలల్లోనే…
అనతి కాలం లోనే..లా అండ్ ఆర్డర్ పోలీస్ చేతుల్లోకి..
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్ట్..

రణం న్యూస్ కోరుట్ల:ఆగస్ట్7,
పల్లె పల్లెకు వ్యాపించిన మత్తు పదార్థాలు యువత జీవితాలను చిత్తు చేస్తున్నాయి.మైనర్ లు మొదలుకొని చాలావరకు యువకులు మద్యం ,గంజాయి , ఇతరత్రా మత్తు పదార్థాలకి బానిసలై ఆ మైకంలో ఎం చేస్తున్నారో కూడ తెలియని పరిస్థితి. కానీ కోరుట్ల లో ఈ మత్తులో అల్లరి చిల్లర గొడవలు మొదలు కొని ప్రాణాలు తీసుకునే సంస్కృతి కూడా వచ్చింది.చాలా సంఘటనలు జరిగాయి. వాటిని పక్కన పెడితే… ప్రస్తుతం కోరుట్ల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.. నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారి నేరాల నియంత్రణలో శాంతి భద్రతల పర్యవేక్షణలో దిట్టగా మెదులుతున్నాడు. అల్లరి మూకల ఆగడాలు సాగడం లేదు.. మోటార్ సైకిళ్ల దూకుడు లేదు… దాదాపు గతంలో కంటే ఎక్కువ శాతం ఈ రోజు ప్రజలు పోలిస్ థానాకు వెళ్తున్నారు. వారి దగ్గరకు వెళితే న్యాయం జరుగుతుంది అనే భావనలోకి వచ్చారు. నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో గతంలో గంజాయి కేసులు నమోదు అయ్యాయి కానీ కోరుట్లలో మాత్రం ఒకే ఒక్క కేసు నమోదు అయింది. రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు ఈ గాంజ అమ్ముతున్నారు సేవిస్తున్నారని పోలీస్ లు అదుపులోకి తీసుకుని వారు మైనర్ లు అని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అనే అపవాదులు కుడా ఉన్నాయి.కానీ ప్రస్తుతం కోరుట్ల పోలీస్ శాఖ తీరును ప్రజలు మేధావులు భేష్ అంటున్నారు.

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్ట్::-
కోరుట్ల, జగిత్యాల పట్టణాలకి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో ఓ వ్యక్తి వద్ద అరకిలో గంజాయి కొని పట్టణాల్లో అమ్మడానికి తెచ్చినట్లు నిర్ధారించిన పోలీసులు అమ్మిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.అమ్మడానికి తెచ్చుకున్న గంజాయిని సేవిస్తున్న ఆరుగురు యువకులను పట్టుకున్నట్లు కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం గౌతమ్ మోడల్ స్కూల్ వెనకాల గురువారం ఆరుగురు వ్యక్తులు అమ్మకానికి తెచ్చుకున్న గంజాయిని సేవిస్తున్నరనే సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన ఎండి అమీర్ ఖాన్(28), ఎండి ముషేర్(29), ఎండి సోయల్ (26), కోరుట్ల పట్టణానికి చెందిన అబ్దుల్ హురేశి(23), షేక్ మజీద్(24), ఎండి ఉమర్(26), అనే ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారి వద్ద నుండి సుమారు 15 వేల విలువగల అరకిలో గంజాయి,మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు సీజ్ చేసామన్నారు. ఆరుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించమని తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గంజాయి రహిత పట్టణముగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎంతటి వారైనా సరే గంజాయి అమ్మిన సరఫరా చేసిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సై చిరంజీవి ఎస్సై 2 రామచంద్రం, పిసి లు రాజేశ్వరరావు, పురుషోత్తం, గట్టు శ్రీనివాస్ లను పై అధికారులు అభినందించారు.

