

రణం: న్యూస్ జగిత్యాల: మార్చి24
మార్చి 24 ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక ఐ ఎం ఏ భవన్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు.క్షయవ్యాధి పై రోగులకు చేస్తున్న సేవలకి గాను ఉద్యోగులకు అవార్డు లు ప్రధానం చేశారు.ఉత్తమ సూపర్ వైసర్ గా దావా ఆంజనేయులు,ఉత్తమ లాబ్ సూపర్ వైసర్ గా రియజోద్దీన్ కు ఉత్తమ లాబ్ టెక్నినిషియన్ గా సాయి కి అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు క్షయ వ్యాధి పై నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ విద్యార్థులకు క్షయ వ్యాధి, లక్షణాలు అది వ్యాపించే విధానం బ్యాక్టీరియాను పరీక్షించే విధానాల గురించి, చికిత్సల రకాలు డ్రగ్ సెన్సిటివ్ టిబి , డ్రగ్ రెసిస్టెన్స్ టీబి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్షయ వ్యాధిపై అవగాహన పెంచుకొని ప్రజలలో కుటుంబ సభ్యులలో అవగాహన కల్పించాలని, ఎవరికైనా లక్షణాలు కనిపించినట్లయితే హాస్పిటల్కు పంపించి చికిత్స తీసుకునే విధంగా తోడ్పాటు నందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ డబ్ల్యూ తుంగూరి వెంకటేషం,హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్ ,తరాల శంకర్ ,డి పి పి ఎం హరీష్ ,సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.