


రణం: న్యూస్ జగిత్యాల: మార్చి21
మార్చి 24వ తారీఖున జరిగే ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు క్షయ వ్యాధి పై క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీల్ రావు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన విద్యార్థులకు క్షయ వ్యాధి, లక్షణాలు అది వ్యాపించే విధానం బ్యాక్టీరియాను పరీక్షించే విధానాల గురించి, చికిత్సల రకాలు డ్రగ్ సెన్సిటివ్ టిబి , డ్రగ్ రెసిస్టెన్స్ టీబి పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్షయ వ్యాధిపై అవగాహన పెంచుకొని ప్రజలలో మరియు కుటుంబ సభ్యులలో అవగాహన కల్పించాలని, ఎవరికైనా లక్షణాలు కనిపించినట్లయితే హాస్పిటల్కు పంపించి చికిత్స తీసుకునే విధంగా తోడ్పాటు నందించాలని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ నీతూ, డాక్టర్ సుమలత, డాక్టర్ పవన్, డాక్టర్ ప్రవీణ్ విద్యార్థులను 10 గ్రూపులుగా విభజించి క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఇందులో విజేతలైన వారికి మార్చి 24 నాడు జరిగే వరల్డ్ టీబీ డే కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ, మరియు తృతీయ బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, టీబి లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్, జి జి హెచ్ ఇంచార్జ్ సూపర్నెంట్ డాక్టర్ సుమన్, వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్, ఎమ్మెస్ డబ్ల్యూ తుంగూరి వెంకటేషం,హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్ ,తరాల శంకర్ ,డి పి పి ఎం హరీష్ ,సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.