డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్
బల్దియా కార్మికులకు క్షయ వ్యాధి నిర్దారణ పరీక్షలు
రణం:: న్యూస్ కోరుట్ల: ఫిబ్రవరి6
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో కార్మికులకు క్షయ వ్యాధి నిర్దారణ పరిక్షలు టిబి సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి నీలారపు శ్రీనివాస్ పాల్గొని అతివేగంగా వ్యాపించే వ్యాధుల్లో క్షయ వ్యాధికూడా ప్రదకరమైనది.ఈ వ్యాధి సోకిన వారికి ఆకలి లేకపోవడం,2వారాలకు మించి దగ్గు ఉండటం, బరువు తగ్గడం ముక్య లక్షణాలు అని,ఇట్టి క్షయ వ్యాధి ప్రభుత్వ ఆరోగ్యకేందాల్లో ఉచిత పరీక్షలు,ఉచితముగా మందులు అందజేయబడుతాయని తెలిపారు.ఈ వ్యాధి సోకినవారు తగిన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతారని అన్నారు. కోరుట్ల వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఏరియా హాస్పిటల్ సూపరెండేంట్ సునితరాని,వైద్యులు వినోద్,శృతిలయ,శివాని జిల్లా పీపీఎం కట్ట హరీష్ టిబి సూపర్ వైసర్ లు ఇమ్రాన్,మల్లికార్జున్,రియాజ్,ఆంజనేయులు,పాల్గొన్నారు


