మెట్ పల్లి డిఎస్పీ అడ్డూరి రాములు
రణం న్యూస్, మేడిపల్లి మండలం, ఆగస్టు 8:

జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా డి.ఎస్.పి రాములు శుక్రవారం రోజున మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్ భవనంను, స్టేషన్ రికార్డులను పరిశీలించి సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ, నేరాల నియంత్రణలో చురుకుగా పనిచేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి పోలీస్ డిపార్ట్మెంట్ విలువలను పెంపొందించాలని, రాబోయే గణేష్ నవరాత్రులలో, లోకల్ బాడీ ఎన్నికల్లో సమర్థవంతమైన విధులు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ డిపార్ట్మెంట్ కు మరింత మంచి పేరు తేవాలని, బ్లూకోల్ట్ , పెట్రో కారు విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కోరుట్ల ఎస్సై చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.

