
- మెడికల్ అసోసియషన్ అధ్యక్షుడే అధికారిగా అవతారం ఎత్తిన వైనం…
- అధ్యక్షుడు చెప్పిన షాప్ అధికారికి టార్గెట్
- ఏ సమస్య వచ్చినా అతడికే చెప్పండి…
- ఇది ఒక జిల్లా స్థాయి అధికారి సమాధానం..
- అనుమతులు విరుద్ధంగా మందుల అమ్మకాలు..
- కిరాణ షాపుల్లా వెలుస్తున్న మెడికిల్ షాప్ లు..
- ఎలాంటి అనుమతులు అర్హతలు లేకుండా దుకాణాల నిర్వహణ…
- ఒక్కో షొప్ కు ఒక్కో రేటు… అన్ని తానై నడిపిస్తున్న కోరుట్ల అధ్యక్షడు
- కానరాని ఔషధ నియంత్రణ అధికారి తనికీలు..
రణం: న్యూస్ ( కోరుట్ల, ఫిబ్రవరి1) : ఓ ఫార్మాసిస్టుఉండడు..
ప్రిస్కిప్షన్ అవసరం అసలే ఉండదు.. మెడిసిన్స్ మాత్రం యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తుంటారు. ఏ మందు కావాలంటే ఆ మందును డాక్టర్ చీటి లేకుండానే చేతిలో
పెట్టేస్తుంటారు. కడుపు నొప్పొచ్చినా, కాలు నొప్పొచ్చినా .. మెడికల్ షాప్ కు వెళ్తే మందులిచ్చేస్తున్నారు. నిద్ర రాకపోయినా.. గర్భం వద్దను కున్నా ఏ మందు పడితే ఆ మందును ఇట్టేఇచ్చేస్తున్నారు.
ధనార్జనే ధ్యేయంగా మెడికల్ వ్యాపారం… దర్జాగా జీరోదందా
అర్హత లేకుండానే మెడికల్ షాపులు నిర్వహి స్తున్నారు. జీరో వ్యాపార కేంద్రంగా కోరుట్లలో “మూడు పువ్వులు ఆరు కాయలు” గా కొనసాగుతుంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు ఉండవు. ఎవరు మందులు అడుగుతే వారికి ఇచ్చుడే ఇచ్చిన మందులకు బిల్లులు లేకుండానే నిలువు దోపిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చదువు లేని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జెనరిక్ మందులను కూడా ఎమ్మార్పీకి విక్రయిస్తు దోచుకుంటున్నారు. అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండా మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు – శాంపిల్స్ కూడా సొమ్ము చేసుకుంటున్న వైనం
మెడికల్ షాపులో మందుల విక్రయాలు తప్పనిసరిగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు అమ్మాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ మెడికల్ షాపులు నిర్వాహకులు ఆ నిబంధనలు పాటించకుండా ఎవరికి పడితే వారికి ఏవి పడితే అవి మందులను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల జిల్లావ్యాప్తంగా మెడికల్ షాపులు నిబంధనలు అతిక్రమించి శాంపిల్స్ (జీరో దందా) అమ్మకాలు చేపడుతూ లాభార్జనే ధ్యేయంగా ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నారు. మెడికల్ షాపు నిర్వహకులు కన్సల్టెంట్ డాక్టర్స్ కు గదులను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు నిర్వహిస్తున్న ఆర్.ఎం.పిలను గుప్పిట్లో పెట్టుకొని ముడుపులను ఆశగా చూపి రోగులకు అనవసరమైన మందులను అంటగడుతున్నారని విమర్శలు ఉన్నాయి.
వైద్యులు రాసిన మందులకు బదులుగా వేరే కంపెనీల మందులు ఉన్నాయంటూ జీరో దందాకు తెర లేపుతున్నారు. బ్రాండెడ్ కంపెనీలవి ఇవ్వకుండా అంటగడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అర్హత లేని వ్యక్తులతో మందుల అమ్మకాలు
మెడికల్ షాపులో ఫార్మసీ చదివిన వ్యక్తులతో అమ్మకాలు చేపట్టాలని నిబంధనలు ఉన్నప్పటికీ, మెడికల్ షాపులో యాజమాన్యం అర్హతలేని వ్యక్తులతో మందులను అమ్మకాలు చేపడుతూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. నియంత్రించాల్సిన ఔషధ అధికారులు మెడికల్ షాపుల నిర్వహణ పై ఎలాంటి. పర్యవేక్షణ లేకపోవడంతో యాజమాన్యాలు అర్హత లేని వ్యక్తులతో మందుల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. డాక్టర్లు రాసిన ఫ్రీస్క్రిప్షన్లు అర్థంకాక ఒకరకం మందులకు బదులుగా వేరేరకం మందులను అంటగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులో ఎక్కడ కూడా బీ ఫార్మసీ, డి ఫార్మసీ చదివిన వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలను మరచి ఎవరు పడితే వారు అర్హతలుఉన్నా.. లేకున్నా.. మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతోచెలగాటమాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
బిల్లులు లేకుండానే మందుల విక్రయాలు
మెడికల్ షాపుల నిర్వహణలో మందులు కొనుగోలుదారులకు తప్పనిసరిగా బిల్లును ఇవ్వాలి. అయినప్పటికీ మెడికల్ షాపుల యజమానులు బిల్లులు ఇవ్వకుండా మందుల అమ్మకాలు చేపడుతున్నారు. అయితే జనరిక్ మందులను బ్రాండెడ్ కంపెనీలుగా చూపిస్తూ రెట్టింపు డబ్బులను ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తున్నారు. తీరా చూసి జనరిక్ మందులు అని ప్రశ్నిస్తే ఈ మందులు ఆ మందులు ఒకే రకంగా ఉన్నాయని రకరకాల సమాధానాలు చెపుతూ మాట దాటవేస్తున్నారని రోగులు వాపోతున్నారు. బిల్లులు ఇవ్వుమని అడుగుతే చాలా మంది మందుల కోసం నిలబడుతరని కాబట్టి అలస్యం అవుతుందని డొంక తిరుగుడు సమాధానం ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. బిల్లులు ఇస్తే తమ బండారం బట్టబయలు అవుతుందని బిల్లులు ఇవ్వకుండా మందుల అమ్మకాలు జరుపుతున్నారని వాపోతున్నారు..
ఔషధ నియంత్రణ అధికారిగా అవతారం ఎత్తిన అసోసియేషన్ అధ్యక్షడు
కోరుట్ల డివిజన్ లో ఎలాంటి మందులు అమ్మినా.. పట్టించుకునే వారు ఉండరనే ఉద్దేశ్యంతో మెడికల్ షాపుల యజమానులు నాణ్యమైన బ్రాండెడ్ కంపెనీలు కాకుండా నాసిరకం మందులను అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ షాపులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు మామూలు మత్తులో పడి మెడికల్ షాపుల పర్యవేక్షణను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి కూడా ఈ మందులు అమ్ముతున్నారని ఎంత స్టాక్ ఉన్నదని స్టాకు సంబంధించిన లెక్కలు, బ్రాండెడ్ కంపెనీల మందులా.. నాసిరకం మందులా.. అనే కనీస పర్యవేక్షణ చేయకపోవడం తో మెడికల్ షాపుల నిర్వహణ పై దృష్టి సాధించకపోతే నాసరికం మందుల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. జిల్లాలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జనరిక్ మందు లను బ్రాండెడ్ కంపెనీల మందులుగా అమ్ముతున్న మెడికల్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోతే ప్రజల ప్రాణాల కు భద్రత ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి జిల్లాలో ఉన్న మెడికల్ షాపులపై సోదాలు చేసి అధికారి కానరాక పోవడం అధ్యక్షుడు చెపితేనే తనికీలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.అధ్యక్షుడు చెప్పిన మెడికల్ షాప్ ల పైనే అధికారి వస్తున్నాడని, ఈ మధ్య కాలంలో పట్టణం లో ని కల్లర్ రోడ్ లో ఓ అనుమతులేని మందుల దుకాణం తనికీ చేసి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని ఒక పత్రిక లో వార్త సంచలన అయింది. ఏది ఏమైనా అధ్యక్షుడి జేబులో అధికారి అని గుస గుసలు వినిపిస్తున్నాయి.
అసోసియేషన్ అధ్యక్షుడి అడుగుజాడల్లో అధికారి
దుకాణం పెట్టాలన్న,రెన్యూవల్ కావాలన్న అంతా ఈ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడి చూసుకుంటాడు.ఎవరైనా ఎదురు మాట్లాడితే వారి మందుల దుకాణం తనికీ జరుగుదే..కాదు పోదు అంటే ఏడాది మాములు పెంచుడే. అధ్యక్షుడి మాటే అధికారి మాట.ఆరు నెలలకు ఒకసారి అధికారి అడిగాడు అంటూ ఒక్కో మెడికల్ షాప్ నుండి నాలుగువేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఏదాడికి ఎనిమిది నుండి పన్నెండు వేలు ముట్టచెప్తుమని అయిన విచ్చల విడిగా అనుమతులున్న లేకున్నా మందులు విక్రయాలు జరుగుతున్నాయని షాప్ నిర్మావహకులు బహిరంగానే అధ్యక్షుని తీరుని ఎండగడుతున్నారు.