
— సామూహిక అక్షరాభ్యాసాలు..
— పుస్తక పూజ, విజయ కంకణ ధారణ..
— బంగారు కిరీటం బహుకరణ
రణం న్యూస్, కోరుట్ల (కల్చరల్):పట్టణంలోని జ్ఞాన సరస్వతీ దేవాలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సరస్వతీ మాత జన్మదినమైన వసంత పంచమిని పురస్కరించుకుని స్థానిక శ్రీ జ్ఞాన సరస్వతీ మాత ఆలయంలో ఉదయం ఆలయ అర్చకులు గౌతం శర్మ, వినయ్ శర్మ గారల వైదిక నిర్వహణలో సరస్వతీ అమ్మ వారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం, పుస్తక పూజ, విజయ కంకణ ధారణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యకు నిలయం, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీ మాత జన్మదినం రోజున అక్షరాభ్యాసం, పుస్తక పూజ చేయడం వల్ల ఉత్తమ విద్యతో పాటు పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
విచ్చేసిన భక్తులు, విద్యార్థులు తీర్థ, పులిహోర ప్రసాదాలు స్వీకరించారు.స్థానిక వాస్తవ్యులు విక్టరీ సెల్ పాయింట్ అధినేత మచ్చ వెంకటరమణ – వాణి దంపతులు 21 గ్రాముల బంగారు కిరిటాన్ని బహుకరించారు.ఉత్సవ దాతలుగా పిన్నంశెట్టి శ్రీనివాస్ – జ్యోతిర్మయి దంపతులు వ్యవహారించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి తోట రాజు, కోశాధికారి జుంబర్తి రమేష్, ఉపాధ్యక్షులు గట్ల ఆనంద్, సహాయ కార్యదర్శి కాసు క్రాంతి, గెల్లె గంగాధర్ చలిగంటి వినోద్ కుమార్, గౌరవ సలహా సభ్యులు గడ్డం మధు, బెజ్జారపు రాజు, గాజంగి లక్ష్మీపతి, అల్వాల శ్రీనివాస్, బొమ్మ రాజేశం, కల్లూరి సాయి మరియు పులిహోర ప్రసాద వితరణ లో శ్రీ లలితా సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
