సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి..
రణం న్యూస్ కోరుట్ల: జులై 4జగిత్యాల జిల్లా కోరుట్ల వెటర్నరీ కాలేజ్ దగ్గర సోమవారం గంజాయి విక్రేతను కోరుట్ల పోలీస్ లు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే సమాచారం తెలుసుకున్న కోరుట్ల ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి గంజాయి అమ్ముతున్న ఎండి ఫయాజుల్ రెహమాన్ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.అతనికి గంజాయి సరపరా చేసి వ్యక్తి పరారీలో ఉన్నాడు. భవిష్యత్తులో ఎవరైనా గాంజా ఉపయోగించిన త్రాగిన, వినియోగించిన, రవాణా చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఎం.చిరంజీవి తెలిపారు.
