రణం న్యూస్ కోరుట్ల,జూన్ 21

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లో మద్యం మత్తులో కొత్త బస్టాండ్ ఇన్ గేట్ దగ్గర కత్తులతో యువకులు హల్చల్ చేశారు. మాదాపూర్ కాలనీకి చెందిన హైమద్,బన్నీ అనే యువకుల పై అదే కాలనీ కి చెందిన కొందరు యువకులు తల్వార్ తో దాడి చేసి గాయపరిచారు.దాడిలో ఇద్దరు యువకులకు తలలకు రక్తగాయాలు కాగా ప్రాణాపాయం తప్పింది. గాయాల పాలైన యువకులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు ఏది ఏమైనా విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్న సంఘటన జరిగి గంట సమయం గడిచినా అసలు పట్టించుకునేవారు లేకపోవడం గమనార్హం.