వారం రోజుల్లో పదిసార్లు ఫోన్ లో పేర్లు మార్పు…
నోటీస్ పంపాము అంటూ హడావుడి… పైన్ కట్టాలి అంటూ దభాయింపు
నా పేరిట వచ్చే ఫేక్ కాల్స్ ను నమ్మద్దు..కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్
రణం న్యూస్ కోరుట్ల: నవంబర్ 28: కోరుట్ల పట్టణంలోని శ్రీ బాలాజీ హాస్పిటల్ కి 8332067220 ఫోన్ నెంబర్ నుండి 6303255562 గల హాస్పిటల్ హెల్ఫ్ నెంబర్ కు ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా 3.40 కి ఫోన్ రాగా నేను కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను మీ డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడగగా ఆ హాస్పిటల్ రిసేప్నిస్స్ట్ నా వద్ద లేదండి అని సమాధానం ఇవ్వగా మీ హాస్పిటల్లో సూపర్వైజర్ ఎవరండి అని అడగగా శశిధర్ ఉంటాడండి అతను కూడా లేడండి అని సమాధానం ఇచ్చారు.దానికి అతడు మీ హాస్పిటల్ కు ఫైన్ వేస్తున్నాం రేపు నోటీసు పంపుతాం చెప్పండి అని ఫోన్ పెట్టేయడం జరిగింది. దీనిపై కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ వివరణ అడగగా ఈ ఫోన్ కాల్ ఫెకండి ఇలాంటి ఫోన్ నేను కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ చెయ్యమని తెలిపారు. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే పట్టణ ప్రజలు ఎవరు కూడా స్పందించకూడదని ఆయన అన్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే నాకు తెలియపర్చాలని అన్నారు.

