రణం న్యూస్ కోరుట్ల: మే 29, కత్తులతో దాడి చేసుకున్న తండ్రీకొడుకులు జగిత్యాల జిల్లా కోరుట్లలో గురువారం తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. పట్టణానికి చెందిన రాచకొండ దేవయ్యను, కొడుకు నవీన్ తాను చేసిన అప్పులు తీర్చాలని, ఆస్తి పంపకాలు చేయాలని గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తండ్రిపై కత్తితో దాడి చేయగా.. దేవయ్య ఎదురుదాడి చేశాడు. ఈ ఘటనలో నవీన్‌కు తీవ్ర గాయాలు కాగా.. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.