

లెప్రసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు
రణం: న్యూస్ జగిత్యాల: ఫిబ్రవరి 20
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లెప్రసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు వారి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ గారితో జిల్లాలో లెప్రసీ డిటెక్షన్ సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం కుష్టు వ్యాధి 2027 వరకు నిర్మూలన చేయాలని భావిస్తోంది అని అందుకు అందరూ సహకరించి వ్యాధిని లేకుండా చేయాలని తెలిపారు. కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లేప్రే అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని, ఇది అతి పురాతనమైన ఒక అంటువ్యాధి తెలిపారు. దీన్ని తొందర గా గుర్తించి తగిన మందులు వాడి వ్యాధి వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి రక్షణ పొంద వచ్చని తెలిపారు.
కుష్టు వ్యాధిగ్రస్తులు నుంచి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శరీరంలో ఉండే చల్లని ప్రదేశాలయిన కాళ్లు చేతుల్లోకి ఈ బాక్టీరియా చేరుకుంటుంది. దీని యొక్క ఇంకుబేషన్ పీరియడు రెండు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది. నరాల చుట్టూ ఉండే మయాలిన్ షీటు ను నాశనం చేస్తుంది. అందువలన నరాలు వాపు మరియు నరాలు దెబ్బతినడం, పట్టుత్వం కోల్పోవడ జరిగి, అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కావున రాష్ట్రంలో ఆశా బేస్డ్ సర్వలెన్స్ లేప్రోసి సర్వే ను చేపట్టడం జరుగుతుంది. ఇందులో ఇంట్లో ఎవరికైనా మచ్చలు ఉన్నాయా అని అడగడమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయవలెనని శరీరంపై పాలిపోయిన లేదా ముదురు ఎరుపు రంగు మచ్చలు ఉన్నట్లయితే పరీక్షించి వైద్యుల వద్దకు తీసుకురావాలని తెలిపారు. ఆ ఆశ సందర్శన సమయం లో ఇంట్లో ఎవరైనా లేకపోయినా ఆశ మళ్ళీ ఆ ఇంటిని సందర్శించి ఆ వ్యక్తులను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయవలెనని సూచించారు. ఈ వ్యాధి వలన స్పర్శ కోల్పోయిన మచ్చలు, నరాల వాపు ,చర్మంపై నూనె పూసినట్టుగా ఉంటాయని,ఈ వ్యాధి వల్ల అల్నార్ మరియు రేడియస్ నరాలు ఇన్వాల్వ్ అవుతాయి కావున రిస్ట్ డ్రాప్ మరియు ఫుట్ డ్రాప్ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 1958లో జాతీయ కుష్టు వ్యాధి నివారణ ప్రోగ్రాం ను ఏర్పాటు చేసారు .మల్టీ డ్రగ్ తెరపి (బహుళ ఔషధ చికిత్స) వచ్చినప్పటినుండి వ్యాది చాలా తగ్గుముఖం పట్టిందని 2005లో 20000 మందికి ఒకరి చొప్పున వ్యాధి బారిన పడేవారు ఉన్నారని తెలిపారు. ఫోకస్డ్ లెప్రసి క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా కొత్తగా లెప్రసీ వ్యాధి గుర్తించిన, వ్యక్తి సంబంధం ఉన్న చుట్టూ పక్కల కనీసం 20 మంది కాంటాక్ట్స్ కు రిఫ్యాంపిసిన్ క్యాప్సుల్ ఒక డోసు ఇవ్వడం వల్ల వారిలో వ్యాధి రాకుండా నివారించవచ్చని తెలిపారు. ప్రజలకు సరైన అవగాహన లేక సోషల్ స్టిగ్మా తో తొందరగా వ్యాధిని గుర్తించలేక మందులు వాడక ఆలోపు ఇతరులకు వ్యాధిసోకడం, వారు వ్యాధి ముదిరి అంగవైకల్యం పొందడం జరుగుతుంది అని తెలిపారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీనికి సంబంధించిన ఎం డి టి చికిత్స ఉందని బాధితులు సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. జిల్లాలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, మీడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, మరియు ఆశా కార్యకర్తలు ప్రతినెల ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము &సబ్ సెంటర్లలో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ , జిల్లా కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ వైద్య అధికారులు డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ నరేష్ రాష్ట్ర బృందం వెంకటరమణాచారి, వెంకటరమణ, శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ ఆరోగ్య విద్యా బోధకులు కటుకం భూమేశ్వర్, సిహెచ్ఓ రాజశేఖర్, డిపిఎమ్ఓ లు శంకర్ నాయక్, కుతుబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.