ప్రభుత్వ పాఠశాల కు కుక్కల గండం….
— కొంతకాలంగా తెరిచే ఉంటున్న పాఠశాల ప్రధాని ద్వారం…
— కుక్కల బీభత్సంతో భయాందోళనకు గురవుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు
— పట్టించుకోని గ్రామ పాలకవర్గం

రణం న్యూస్ కోరుట్ల రూరల్: జులై 24, అసలే కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో చాలామంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన గేటు మాత్రం గత కొంతకాలంగా లేకపోవడంతో కుక్కలు సొరపడి విద్యార్థులకు భయాందోళనకు గురిచేస్తున్నాయి,జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన గేటు గత కొంతకాలంగా లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రధాన గేటు గోడ కూలిపోవడంతో బయట తిరుగుతున్న కుక్కలు లోపటికి వెళుతున్నాయి దీంతోపాటు రాత్రి సమయంలో మూత్ర విసర్జన కూడా చేస్తున్నట్లు అక్కడి వారు చెప్తున్నారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా ఉండటంతో పాటు ఉపాధ్యాయులు మంచి విద్య బోధన అందిస్తున్నారు, కానీ పాఠశాల ప్రధానాద్వారం లేకపోవడం వల్ల పిల్లలను స్కూలుకు పంపించేందుకు విద్యార్థి తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఇదే అంశంపై పలుసార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని వెంటనే అధికారులు అలాగే గ్రామ అభివృద్ధి శాఖ చొరవ తీసుకొని పాఠశాల ప్రధాన గేటు నిర్మించాలని కోరుతున్నారు, పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో కుక్కలు దాడులు చేసె ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ప్రమాదాలు జరగకముందు నివారణ చర్యలు చేపట్టాలని గ్రామ వి డి సి దీనిపై చొరవ తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు…
