మోత్కురావుపేట-చందుర్తి రోడ్డును వెంటనే పూర్తి చేయాలి…
యూరియా విషయంలో రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది..
కలికోట- సూరమ్మ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి..
వేములవాడ టిఆర్ఎస్ ఇంచార్జ్ లక్ష్మీనరసింహారావు.
రణం న్యూస్, భీమారం మండలం, సెప్టెంబర్ 9:

అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ప్రజల్ని మోసం చేయడం మానుకొని ప్రజలకి సుపరిపాలన అందించాలని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆన్నారు.
మంగళవారం జగిత్యాల జిల్లా మేడిపల్లి,భీమారం మండలంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గెలిచి 21 నెలలు గడుస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం విఫలమవుతున్నారని,
గెలిచిన తక్కువ సమయంలోనే మోత్కరావుపేట-చందుర్తి రోడ్డును పూర్తి చేసి బస్సులను నడిపిస్తానని హామీ ఇచ్చి, గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారన్నారు.
రాజలింగంపేట చెరువు కట్ట బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెగితే తాత్కాలికంగా 3లక్షల రూపాయలతో మరమ్మత్తులు చేసి పూర్తిస్థాయిలో నిర్మాణం చేద్దామన్న క్రమంలో ప్రభుత్వం మారడంతో రాజలింగంపేట- దేశాయిపేట వంతెన, చెరువు కట్ట నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్మించడం లేదని వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేసి ఇక్కడి రోడ్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతన్నకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. జగిత్యాల జిల్లాకు 30000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే సుమారుగా 24070 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు వచ్చిందని, సుమారుగా 5930 టన్నుల యూరియా రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంగా రుజువు అయిందన్నారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కొబ్బరికాయలు కొట్టి, భూ సేకరణ విషయంలో చిత్తశుద్ధి లేక ప్రాజెక్టును పట్టించుకోక కాలయాపన చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చనిమెడ లక్ష్మీనరసింహారావు వెంట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
