రణం న్యూస్: మేడిపల్లి; జూన్8

ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి అధ్యాపకులందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర ఉపాధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొట్టాల తిరుపతిరెడ్డి, అత్తినేని శ్రీనివాస్ లతో కలిపి ఆయన సందర్శించారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలోని బడుగు బలహీన విద్యార్థుల ఉన్నతి కోసం ప్రభుత్వం నూతన జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు నేడు అనేక రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.
రెండవ ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న క్రమబద్ధీకరించబడ్డ జూనియర్ లెక్చరర్స్ కి సహజ న్యాయం సూత్రాలకు అనుగుణంగా నిబంధనల ప్రకారం కచ్చితంగా రావాల్సిన రెండవ ఇంక్రిమెంటును అందరూ రాక్షసనందాన్ని పొందాలని అడ్డుకోవడం చాలా విదంగా ఉందన్నారు. ప్రభుత్వము రెండవ ఇంక్రిమెంట్‌ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సామరస్య పూర్వక వాతావరణాన్ని దెబ్బతీయొద్దని ఆయన కోరారు. కలిసికట్టుగా పనిచే స్తే కళాశాలల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.