పేరుకే స్వీట్ …తింటే రుచే వేరు….
కరీంనగర్ డెయిరీ వారి నిర్వాకం…
గడువు ముగిసే రోజు వరకు అమ్మకాలు….
రణం న్యూస్ కోరుట్ల సెప్టెంబర్17

ఎక్కడైనా స్వీట్ అంటే తియ్యగానే ఉంటుంది కానీ కరీంనగర్ డెయిరీ వారి స్వీట్ మాత్రం పుల్లగా ఉంటుంది.ఇదేంటని ఆశర్య పోతున్నారా నిజమేనండోయ్ కరీంనగర్ డెయిరీ బాసుంది అనే స్వీట్ మాత్రం పుల్లగా ఉంటుందీ ఈ పదార్థం ఎక్కడైనా తీయగా ఉంటుంది కానీ వీరి ప్రొడక్ట్ మాత్రం పులుపుగానే ఉంటుంది.
వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటికి బంధువులు వచ్చారు అని తీపి పదార్థాలు తీసుకుందామని కరీంనగర్ డెయిరీ వారి మిల్క్ ఏజంట్ షాప్ కు వెళ్లి ఆ పాల దుకాణము లో రెండు బాసుంది అనే స్వీట్ బాక్సులుతీసుకున్నాడు.ఇంటికి తీసుకొచ్చి ముందుగా స్వీట్ అందరికి ఇచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఆ తీపి పదార్థం తినడం మొదలుపెట్టారు.. ఆ స్వీట్ లో తీయదనం కాకుండా పుల్లగా రావడంతో ఏ షాప్ లో తీసుకున్నాడో అక్కడి వెళ్ళి వారించగా మేము ఏజంట్లము మీరు కంపెనీ వారితో మాట్లాడుకోండి అన్నారు.అన్ని తెల్సిన వినియోగదారుడు ఎం చేయాలో తోచక మీ కంపెనీ బిల్లు అయిన తెప్పించండి అంటే ఏ బిల్లులు నా దగ్గర లేవు అంటూ దాటవేశాడు. ఇలా కరీంనగర్ డెయిరీ ప్రొడక్ట్ అయిన బాసుంది స్వీట్ కుళ్ళి పోవడం రుచి మారడం గడువు ముగిసే రోజు అమ్మడం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమేనని ,ఇలాంటి వారి పై సంస్థ పై చర్యలు తీసుకోవాలని వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయిస్తానని బాధితుడు తెలిపాడు. ఇన్ని జరుగుతున్న అధికారుల పర్యవేక్షణ అసలు లేదంటూ బాధితుడు ఆరోపించాడు.

అన్నీ కల్తీయే…
తాగే నీరు,పాలు కల్తీ.. వాడే బెల్లం కల్తీ.. తినే నెయ్యి కల్తీ.. చివరకు కూరలో వేసుకునే అల్లం వెల్లుల్లి, ఉప్పు కారం.. పసుపూ నూనె అన్ని కల్తీ లేని పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి.. నకిలీ ఆహార పదార్థాల తయారీకి అడ్డాగా మారుతోన్నాయి ఉత్పత్తి కేంద్రాలు. గతంలో కల్తీ అల్లం వెల్లుల్లి వ్యవహారం సంచలనం నృష్టించగా.. ఆ తర్వాత పశువుల ఎముకలతో తయారు చేసే కల్తీ నూనె, జనం నిత్యం తాగే, తినే పాలు, పెరుగులోను అన్నిట్లో కల్తీయే. లాభాలను ఆర్జించడానికి ప్రతి తినుబండారాలను కల్తీ చేస్తున్నారు..అదేకోవలోకి పాలు, పాల నుండి తయారైన ఉత్పత్తులను కల్తీ చేయడం చాలా పత్రికల్లో టీవీలలో చూస్తున్నాం. కల్తీ పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కానీ కల్తీ పాలు, కల్తీ పనీర్, కల్తీ నెయ్యిని కల్తీ స్వీట్స్ ని తయారు చేస్తూ లాభాపేక్షతో వ్యాపారాలు చేస్తూన్నారు. కాలం చెల్లిన పదార్థాలు అమ్మకాలు చేస్తూ ప్రజారోగ్యం తో అడుకుంటున్నారు కానీ ఇలాంటి వాటిని అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారని విమర్శలు లేకపోలేదు

