
రణం న్యూస్ మేడిపల్లి : జులై20
జగిత్యాల జిల్లా మేడిపల్లి నుండి కొండాపూర్ వెళ్లే ఈ దారి గుండా నడవాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే పాడాఛారులు ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి,నిత్యం మండలం కేంద్రం నుండి గ్రామాలకు,గ్రామాల నుండి మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ దారే ప్రధానమైనది. ఈ ఇరుకు దారిగుండా ప్రయాణిస్తూ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఒక వాహనం ఎదురుగా వస్తే చాలు ఓ మూలకు జరుగాల్సిందే అలా కాకుండా ఆదమరిస్తే అంతే సంగతులు.మేడిపల్లి నుండి కొండాపూర్ వెళ్ళేదారిలో ,వళ్ళంపెళ్లి గ్రామంలో ప్రధాన దారుల్లో నిత్యం మనకు ఈ ప్రమాద ఘంటికలు దర్శనమిస్థాయి.ఈ రోడ్లను వెడల్పు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

