అబ్బాయి వధువుగా.. అమ్మాయి వరుడిగా..!

రణం న్యూస్ డెస్క్, జులై 2
ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వింత ఆచారం అందరి దృష్టిని ఆకర్షించింది.మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన గుమ్మా నాగార్జునకు, వైపాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రకు వివాహం జరిగింది.ఆచారం ప్రకారం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడిగా వస్త్రాలు ధరించి నాగులపుట్ట వద్ద పూజలు చేశారు.ఇలా చేస్తే సుఖసంతోషాలతో పాటు త్వరగా సంతానం కలుగుతుందని వారి నమ్మకం.
