నా దందాకే అడ్డొస్తారా… మత్తులో యువకుడు పోలీస్ లపై దాడి..
ఆ మత్తు ఏ మత్తో…

రణం: న్యూస్ కోరుట్ల: ఆగస్ట్ 20
“”దశాబ్ద కాలం క్రితం వారికి ఓ ప్రత్యేకథ ఉండేది….
వీరిని చూస్తే క్రిమినల్స్ కు దడ…
వీరు పక్కన నిలబడితే నాయకులకు గౌరవం…
పోకిరీలకు వీరిని చూస్తే చ్చు…చ్చు…
రౌడీమూకలు వీరు కనిపిస్తే పరార్…
అల్లరి మూకలు ఆగకుండా ఉరుకుడే….
వీరి కార్యాలయం మెట్లెక్కడం పెద్ద సాహసమే…
వీరు సీరియస్ గా చూస్తే నేరస్థుల లాగులు తడుసుదే…
ఇది ఒక్కప్పటి ముచ్చట…
కానీ స్వరాష్ట్రం ఏర్పడ్డాక వీరి మనుగడకే అపాయం వాటిల్లింది…
వీరి యూనిఫామ్ కలర్ మారలేదు కానీ పవర్ తగ్గింది…
ప్రెండ్లి పోలీస్ పేరుతో ఈ డిపార్ట్మెంట్ పూర్వపు వైభవాన్ని కోల్పోయింది..
నాడు ఒక కింది స్థాయి ఉద్యోగికి ఉండే విలువ నేడు అధికారి స్థాయి ఆఫీసర్ కు లేదు అనటంలో అతిశయోక్తి లేదు
ఇది నేడు నిత్య కృత్యం జగమెరిగిన సత్యం…
అదే ప్రెండ్లి పోలీస్ మహత్యం అంటున్నారు మేధావులు
వారిపై దాడులు జఋతున్న ఆశ్చర్యపడాల్సిన పని లేదు…“””‘
మత్తులో యువకుడి హల్చల్…..
మత్తులో పోలీస్ లపై దాడి చేస్తూ వదిలిపెట్ట అంటూ ఓ యువకుడు చేసిన వీరంగం తో విధుల్లో ఉన్న అధికారులే బయబ్రఅంతులకు గురైన పరిస్థితి.ఇంతకీ ఆ మత్తు ఎం మత్తు అంటూ ఆ మత్తులో ఏమైనా చేయొచ్చా……. వివరాల్లోకి వెళితే
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లో యూనిఫార్మ్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ల పై దాడి జరిగింది. పట్టణంలో ని తాళ్ల చెరువు ప్రాంతంలో కొందరు మత్తులో తూలుతూ అసభ్యకరంగా కేకలు వేస్తూ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని “100” డయల్ చేయగా విధుల్లో ఉన్న బ్లూ కోట్ వారు ఇద్దరు రక్షక భటులు గంగాధర్, జాహీద్ లు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడి నుండి వెళ్లాలని న్యూసెన్సు చేయొద్దని ఆ యువకులతో వారించగా నా ఏరియాలో నేను ఏమైనా చేస్తాను మీరెవరు నాకు చెప్పడానికి ,మీ వల్లనే నా దందా కరాబు అయింది,మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అంటూ విచక్షణరహితంగా పిడిగుద్దులు గుద్దుతూ చొక్కా చించివేసి దాడి చేసి గాయపర్చారు.గాయపడ్డ కానిస్టేబుల్ జాహిద్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి పంపించారు.ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని పై అధికారులకు పొక్కకుండా జాగ్రతపడ్డ… ఆ నోటా ఈ నోటా మాటలు బయటకొచ్చి చర్చనీయాంశం అయింది. తమను రక్షించ వల్సిన పోలీస్ ల పై దాడులు జరిగడంతో సామాన్యుల పరిస్థితి ఏంటని వాఫోతున్నారు ఏదీ ఏమైనా గత ప్రభుత్వ విధానాలతో తమ ఉనికిని కోల్పోతున్నామని,పోలీస్ శాఖకు పవర్స్ ఇచ్చి శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ఈ ప్రభుత్వమైన ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

