మమ్మల్ని పట్టించుకునే వారే లేరా ?
రణం న్యూస్ కోరుట్ల మే 27
ఇట్లు వీధి కుటుంబాలు అనే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మేము ప్రజలమే మాకు ఓట్లున్నాయి..మెమెందుకు వివక్షకు గురవుతున్నాం అంటూ ఆ చిన్న వీధి ప్రజలు సోషల్ మీడియా లో పోస్ట్ చక్కర్లు కొడుతూ ఔను కదా వారు ప్రజలే వారికి ఓట్లున్నాయి అని వారిని పట్టించుకోవాలి అంటూ అధికారులకు కనిపించేలా లైక్ లు కొడుతున్నారు. ఇలాంటి పట్టణం లో చాలా ఉన్నాయి వారు ఎవరిని కలవాలో ఎవరిని కలిస్త్ న్యాయం జరుగుతదో తెలియక కాదుఅన్ని తెల్సిన వారే ఎం చేయలేని పరిస్థితుల్లో ఇలా సోషల్ మీడియా వేదికగా సమస్యలు ముందుకు తెస్తున్నారు.అధికారులు నాయకులు ఇకనైనా స్పందిస్తాలో లేదో చూద్దాం
వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల గడి బురుజు ప్రాంతంలో ఉన్న ఒక చిన్న వీధి (ఆనంద్ మెడికల్ పక్కన) మూడు కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కానీ పట్టించుకునే వారు లేరు కానీ…అందరూ హేళన చేసే వారే ఎందుకంటే చిన్నపాటి వర్షానికి మా వీధి స్విమ్మింగ్ ఫుల్ లా మారిపోతుంది. వర్షం నీరు ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా రోడ్ పై వెళ్ళే వారు వీధిని చూసి అందరూ హేళన చేస్తున్నారు. మా ఓట్లు వద్దా!!పలు మార్లు సిబ్బంది వచ్చి తూతూ మంత్రంగా పని చేసి ఫోటోలు దిగి సమస్యను గాలికొదిలేస్తున్నారు.దయచేసి కాస్త మా వీధి పై దృష్టి పెట్టాలని కోరుకుంటూ….
ఇట్లు వీధి కుటుంబాలు…