పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కలెక్టర్ సత్యప్రసాద్
రణం న్యూస్ మేడిపల్లి,మే28
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున జరిగిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంజూరు పత్రాలను పొందిన ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతను వినియోగించుకొని గృహాలను నిర్మించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు దివాకర్ రెడ్డి, శ్రీనివాస్, మేడిపల్లి, భీమారం మండల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు,వివిధ గ్రామాల లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
