—వారం రోజులకో మొక్క నాటుటకు ప్రతిజ్ఞ, మూడు సంవత్సరాల పాటు కొనసాగింపు
–27 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పదవతరగతి విద్యార్థులు…
రణం: న్యూస్ కోరుట్ల:మే 5,

బాల్యం ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలను ఇస్తుంది,చిన్ననాటి ఆ మధురానుభూతులు ఎప్పుడు నెమరేసుకున్న మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది,అలాంటి బాల్య మిత్రులు 27 సంవత్సరాల తర్వాత కలిస్తే ఆ ఆనందమే వేరు,కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో 1998-99 సంవత్సరం లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదవతరగతి విద్యార్థులు అత్మీయ సమ్మేళనం లో పాల్గోన్నారు.ఉదయం నుండి సాయంత్రం వరకు వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు, అప్పటి పదో తరగతి విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పైడిమడుగు గ్రామంలోని భక్తులమర్రి వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కు సన్మానం చేశారు, అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు తారతమ్యం లేకుండా ఆటలాడుతూ పాటల పాడుతూ ఎంతో ఉత్సాహంగా గడిపారు.ఈ సందర్భంగా వారు ఓ ప్రతిజ్ఞ చేశారు,సుమారు ఏబ్బైమంది ఎక్కడున్న వారం కోసారి ఓ మొక్క నాటాలని తీర్మానించుకున్నారు.మొక్కనాటి వారివారి బాల్య మిత్రుల గ్రూపులో సమాచారం ఇవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా వారం మొక్క నాటి వాటి సంరక్షించే బాధ్యత కూడా తీసుకోనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.