జెండా మోసినోళ్ళకు కాదు… జేబులు నింపేటోళ్లకు… జేబులు నిండుగా ఉన్నోళ్లకె కౌన్సిలర్ టికెట్ లు
ఒక్కో కౌన్సిలర్ టికెట్ కు మూడు నుండి పదిలక్షల డిమాండ్…
*ఆ జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి తీరు పై సర్వత్రా విమర్శలు..
క్రమ శిక్షణ గల పార్టీలో కాసుల పందెం…
తీవ్ర ఆరోపణలు చేస్తున్న కార్యకర్తలు
రణం న్యూస్ జగిత్యాల జిల్లా: ఫిబ్రవరి 4
పురపాలక కార్య వర్గ ఎన్నికలలో ఓ జాతీయ పార్టీ నుండి పోటీ అభ్యర్థులకు బి ఫార్మ్ ఇచ్చే వరకు వేచి చూసిన సెకండ్ క్యాడర్ లీడర్లు పార్టీ తీవ్ర ద్రోహం చేసిందని జగిత్యాల జిల్లా అధ్యక్షుడి కాసులకోసం టికెట్ లు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేసున్నారు.
ధనమే ప్రధాన అంశంగా మారింది…అధికారం కోసం జెండా మోసినోళ్లకుకాదు…..జేబులు నింపేటోళ్లకు… జేబులు నిండుగా ఉన్నోళ్లకు… కౌన్సిలర్ టికెట్ లు ఇచ్చారని జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల మెట్పల్లి,రాయికల్ మున్సిపాలిటీలకు చెందిన కరుడు గట్టిన నాయకులు సర్వత్రా విమర్శలు చేస్తున్నారు.పైసలున్నోడినే కార్యకర్తలుగా సభ్యత్వం ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడిపై మంది పడుతున్నారు. ఆ జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు దీపం ఉన్నపుడే ఇల్లు సక్క దిద్దుకోవలనుకున్నాడో ఏమో గాని కౌన్సిలర్ టికెట్ కావాలంటే మూడు లక్షల పది లక్షల వరకు డిమాండ్ నదించిందట.. పార్టీని నమ్ముకున్నా కార్యకర్తల గొంతు ను నమ్మించి తడిగుడ్డతో కోసారని… కాసులిచ్చినవాడికే పార్టీ బి ఫార్మ్ అందజేశారని,జెండా కోసం ఏళ్లుగా పరితపించిన కార్యకర్తలు కంటనీరు పెట్టుకుఅంటున్నారు.

పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ,వాట్స్అప్ ,ఇన్ స్ట్రా, ఫేస్బుక్ వేదికగా క్రమ శిక్షణ కు మారుపేరు గా చెప్పుకునే పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుని పై తీవ్రఆరోపణలు చేస్తున్నారు.
ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తాచాటేందుకు సిద్ధమైన వేల జగిత్యాల జిల్లాలో బల్దియా ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీల్లో గుర్తింపు కరువై కంట నీరు పెడుతున్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించకుండా కాసులు ఇస్తేనే టికెట్ అంటూ బేరసారాలు చేస్తున్నారు. కష్ట కాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు టికెట్ లు ఇవ్వకుండా జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి కి ఒక్క కౌన్సిలర్ సీటుకి మూడు లక్షల నుండి బేరం మొదలవుతుందని,అభ్యర్థి ఆర్థిక పరిస్థితి ని బట్టి డిమాండ్ చేస్తున్నారని నిఖార్సయిన కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.డబ్బులు తీసుకుని ఏళ్ల తరబడి పార్టీ నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలను డబ్బులిస్తేనే టిక్కెట్ లు అంటూ బోర్డ్ తగిల్సుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.తమకు కాకుండా బల్దియా ఎన్నికల్లో గుర్తింపు ఇవ్వకుండా డబ్బులు ఉన్న వ్యక్తుల వైపే పార్టీలు మొగ్గు చూపుతున్నాయని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా.. పార్టీలకు కట్టుబడి ఏళ్ల తరబడి జెండాలు మోస్తూ పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేకుండా పోయిందని నాయకులు ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.ఇదే అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. దీంతో ఆశావహుల ఆర్థిక, అంగబలాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నది. పార్టీలో ఎవరు లేనపుడు జెండాలు మోసి, ఏండ్లుగా పనిచేసి, పలుకుబడి ఉన్న నేతలను కాదని, ఆర్థికస్థోమత ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

