ఘనంగా పద్మశాలి కులోన్నతి బోనాలు
రణం న్యూస్ కోరుట్ల, జూలై 15: కోరుట్ల కోటి నవదుర్గ అమ్మవారి ఆలయం నుండి ఆషాడ మాస బోనాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. కొలిచే భక్తులకు కొంగుబంగారంగా నిలిచే శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయం నుండి మంగళవారం కోరుట్ల పట్టణ ప్రధాన వీధుల గుండా పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం మహిళలు నెత్తిన బోనాలతో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గం, పద్మశాలి రాష్ట్ర, జిల్లా నాయకులు, పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, మహిళలు, భక్తులు భారీగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. “ఆషాడ బోనం అమ్మకు అత్యంత ప్రియం” కాగా కోరుట్ల పట్టణ శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో భక్తుల అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. శివసత్తులు ప్రదర్శనలు, పోతురాజులు విన్యాసాలు, కళాకారులు వివిధ రూపాల్లో ప్రదర్శనలు పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


