బాధితుడు తునికి రాజేశం
రణం:: న్యూస్ మల్లాపూర్: ఫిబ్రవరి 17
మల్లాపూర్ మండలం లోని సిర్పూర్ గ్రామంలో దార్శిని రమేష్ మహేష్ అనే తండ్రి కొడుకులైన ఇద్దరు ఆర్ ఎం పి వైద్యుల వల్ల తమ కుమారుడు అనారోగ్యం పాలయ్యాడని ఆర్థికంగా నష్టపోయామని ఒక బాధితుడు తన బాధను రణం దినపత్రిక ప్రతినిధితో వెలిబుచ్చుకున్నారు. ఈ ఇద్దరు ఆర్ఎంపీ… పిఎంపి లు . కమీషన్ కోసం ప్రజల జీవితాలతో వచ్చిరాని వైద్యం చేసి అన్ని విధాలా నష్టపరుస్తున్నారని తెలిపారు…వివరాల్లోకి వెళితే మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన తునికి రాజేశం తన కుమారుడికి జ్వరం వచ్చిందని గ్రామంలోని ఆర్ ఎం పి వైద్యుడు దార్శిని రమేష్ ను చికిత్స నిమిత్తం పిలిపించగా రెండు మూడు ఇంజక్షన్ లు వేసి వెళ్ళాడు.వైద్యుడు ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే తన కుమారుడు నిఖిల్ కడుపు నొప్పితో కిందపడి కొట్టుకున్నాడని ఏదైనా పాయిజన్ ఇచ్చాడు కావచ్చు అని రణం ప్రతినిధితో తెలిపారు.తర్వాత మెటపల్లి లోని బస్ స్టాండ్ దగ్గరలో గల పెట్రోల్ బంక్ ఎదురు సందులో గల శ్రీ గణేష్ ఆసుపత్రికి తరలించారని, అక్కడ పరిస్థితి విషమించడం తో నిజామాబాద్ లోని మనోరమ ఆసుపత్రికి తరలించి లేని రోగాన్ని అంటగట్టారని పేగు కు రంద్రం పడ్డదంటూ ఇంజక్షన్ ఎవరు వేశారు అని మొదట తెలిపారని తర్వాత తమతోబునిత్యం సంబంధాలున్న అర్ ఎం పి వైద్యుడు కి సంబంధించిన పేషంట్ కావడంతో గమ్మునుండి పోయారని తెలిపారు.ఎలాంటి వ్యాధి లేని తన కుమారునికి జ్వరం వస్తే తెలిసి తెలియని వైద్యం చేసి అనారోగ్యం పాలు చేసిన్నారని నాలుగు లక్షల రూపాయల బిల్ చేసి ఆర్థికంగా ,ఆరోగ్య పరంగా కూడా అన్యాయం చేశారని అన్నారు.ఈ సంఘటన పై ప్రజావాణిలో పిర్యాదు చేశామని ,పోలీస్ స్టేషన్ లో పిర్యాదుచేసినామని తమకు న్యాయం చేసేవారు లేరని బాధితుడు తెలిపారు.తన కుమారున్నీ అనారోగ్యం పాలు చేసిన సిర్పూర్ లోని ఈ ఇద్దరు ఆర్ ఎం పి వైద్యులను,మెటపల్లి లోని శ్రీ గణేష్ ఆసుపత్రి వారిని నిజామాబాద్ లోని మనోరమ హాస్పిటల్ పై చర్యలు తీసుకునే వరకు పోరాడుతానని కమీషన్ ల కోసం ప్రజలు ప్రాణాలతో చెలాగాటమాదుతున్న ఆర్ ఎం పి ల కార్పొరేట్ హాస్పిటల్ ల వారి నుండి ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని తమకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని అందుకోసం ప్రతి అధికారిని నాయకులను కలుస్తానని న్యాయం కోసం పోరాడుతానని తునికి రాజేశం తెలిపారు.
