
తెలంగాణలో నకిలీ వైద్యుల పై కొరడా జులిపించారు.ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడుతూ వచ్చిరాని వైద్యం చేసి అనేక మంది అమాయకులను బలి చేస్తున్నారు.నకిలీ ఆర్ ఎం పి పి ఎం పి లకు మెడికల్ కౌన్సిల్ అధికారులు షాకిచ్చారు. నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. ఆర్ఎంపీ లు వారి వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. ఏలాంటి ఇంజక్షన్, గోళీలు ఇచ్చే అధికారం ఆర్ఎంపి, పీఎంపీలకు లేదని తెలిపింది. మెడికల్ కౌన్సిల్ ఈ విషయాన్నీ ఛాలెంజింగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తామని తెలిపింది.