శివాజి జయంతి వేడుకల్లో మైనారిటీ నాయకులు
రణం: న్యూస్ కోరుట్ల: ఫిబ్రవరి 18
మహారాష్ట్ర వీరపుత్రుడు, ధర్మరక్ష పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం మత పెద్దలు, సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఆయన సేవలను కొనియాడారు
ఈ సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ, “శివాజీ మహారాజ్ నిజమైన ధర్మరక్ష పాలకుడు. ఆయన పాలనలో ముస్లింలకు సమాన స్థానం లభించింది. ముస్లిం సైనికులు, అధికారులు శివాజీ పాలనలో కీలక భూమిక పోషించారు” అని అన్నారు.
ముజాహిద్ మాట్లాడుతూ, “శివాజీ మహారాజ్ మసీదులకు ఎలాంటి నష్టం కలిగించలేదు, ఖురాన్‌ను గౌరవించారు. ఆయన సైన్యంలో సిద్ధీ ఇబ్రాహీం, దౌలత్ ఖాన్, మదారి మెహతర్ వంటి ముస్లిం అధికారులకు ఉన్నత స్థానం ఇచ్చారు. ముస్లిం మహిళలకు పూర్తి రక్షణ కల్పించి, వారిపై అన్యాయం జరగకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు” అని వివరించారు.
అలాగే, “శివాజీ మహారాజ్ హిందూ-ముస్లిం ఐక్యతకు గొప్ప ఉదాహరణ. ఆయన యుద్ధాలు మతాల మధ్య ఘర్షణ కోసం కాదని, అన్యాయాన్ని ఎదుర్కొనే ఉద్దేశ్యంతో జరిగాయని” స్పష్టం చేశారు.
శివాజీ భవానిదేవి భక్తుడు మాత్రమే కాకుండా, అన్ని మతాలను సమానంగా చూసేవాడు. ఆయన కాలంలో హిందువుల ఆలయాలతో పాటు మసీదులు కూడా నిర్మించబడ్డాయి. శివాజీ సైన్యంలో ముస్లింలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయుధ విభాగానికి హైదర్ అలీ, నావికాదళానికి ఇబ్రహీం ఖాన్, మందుగుండు విభాగానికి సిద్ది ఇబ్రాహీం బాధ్యతలు నిర్వర్తించారు. శివాజీ సర్వసైన్యాధ్యక్షుడు దౌలత్ ఖాన్, అంగరక్షకుల్లో ముఖ్యుడు మదానీ మెహర్ కూడా ముస్లింలే. ఇలాంటి ఉదాహరణలు శివాజీ మహారాజ్ మతసామరస్యానికి నిలయమని నిరూపిస్తాయి” అని ముజాహిద్ పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ
మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న శక్తులను ఖండించాలి. శివాజీ మహారాజ్ మార్గంలో నడిచి హిందూ-ముస్లిం ఐక్యతను కాపాడాలి” అంటూ ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చేన్న విశ్వనాథం నజీర్ ఖాన్ మహమ్మద్ నసీర్ యూనుస్ ఖాన్ షేక్ వాజిద్ హిందూ-ముస్లింలు కలసి “హిందూ-ముస్లిం ఐక్యత జిందాబాద్!” అంటూ నినాదాలు చేశారు. చివరగా “ఛత్రపతి శివాజీ మహారాజ్ అమర్ రహో!” అనే నినాదాలతో ఈ కార్యక్రమం ముగిసింది.
