
రణం న్యూస్ కోరుట్ల మే 24
భారతి సాహిత్య సమితి ఆధ్వర్యంలో కోరుట్ల సినారే కల భవనంలో శనివారం సాయంత్రం జరిగిన వసంత కవి సమ్మేళనం అలరించింది. స్వర్గీయ డాక్టర్ అందె వేంకటరాజం గారు స్థాపించిన భారతీ సాహిత్య సమితి గత 50 సంవత్సరాలుగా సాహిత్య సేవలు అందజేస్తూ గత ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుందని ఈ ణసందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ పేర్కొన్నారు. ప్రముఖ కవి పండితులు నేరెళ్ల రామకృష్ణశాస్త్రి కావ్యగానంతో ఈ వసంత కవి సమ్మేళనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో హతమైన వారికి, ఇటీవల అకాల మరణానికి గురైన సాహిత్య సమితి ఉపాధ్యక్షులు రాపెల్లి రాజగంగారం గారికి మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి అందె రాజేంద్ర, సాంస్కృతిక కార్యదర్శి రాజోజు భూమేశ్వర్, అందె శివప్రసాద్, బ్రహ్మన్నగారి శంకర్ శర్మ, రుద్రమాణిక్యం, జమన్జ్యోతి గంగారాం, రాధాకృష్ణ, నరేందర్, లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు.

