రణం ప్రతినిధి, మెట్ పల్లి, జూలై 8 మెట్ పల్లి పట్టణ , పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా మన టి జీఎస్ఆర్టిసి మెట్ పల్లి డిపో నుండి అరుణాచలం గిరిప్రదక్షిణ దర్శనార్థమై మంగళవారం రోజు ఆర్టీసీ బస్టాండ్ లో మెట్పల్లి డిపో మేనేజర్ దేవరాజు ఆధ్వర్యంలో బస్సు బయలుదేరినట్లు డి ఎం తెలిపారు. ఇలాంటి సౌకర్యం కల్పించినందుకు భక్తులు సంతొషం వ్యక్తం పరిచారు. మెట్పల్లి డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ అరుణాచలం వెళ్లేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలుతెలియజేసినారు. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు సౌకర్యం కల్పించినందుకు డిపో మేనేజరుదేవరాజు
ప్రయాణికులుఆభినందించారు.ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకున్న భక్తులు చాలా ఆనందం తో బయలుదేరడం జరిగింది అని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ దేవరాజ్ , ఎస్ టి.ఐ ప్రమీల , చంద్రయ్య,రాములు,నాగేష్, రాఘవ, శేఖర్,మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
