నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న బిఆర్ఎస్ నాయకులు…
ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి టిఆర్ఎస్ ది కాదు..
తెలంగాణలో ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు.
చల్మెడ లక్ష్మీనరసింహారావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఉమ్మడి మేడిపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.
రణం న్యూస్, భీమారం మండలం, సెప్టెంబర్ 10:

జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెలిమెడ లక్ష్మీనరసింహారావు మంగళవారం రోజున ఉమ్మడి మేడిపల్లి మండల పర్యటనలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
బిసి బిడ్డ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడడం రాజకీయ ఉనికికోసం తప్ప మరేమీ కాదని,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడ్డ తర్వాత ఓ వైపు అభివృద్ధి, ఓ వైపు సంక్షేమం రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ప్రభుత్వం పై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ, పాలకులు గానీ నియోజకవర్గాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించిన అభివృద్ధి మాత్రం శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బిఆర్ఎస్ కే దక్కిందని విమర్శించారు.
గతలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజలకు ఏడు సముద్రాల అవతల ఉండే జర్మనీ బాబు, ఇప్పుడున్న నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న చెల్మెడ లక్ష్మీనరసింహారావు పరిస్థితి కూడా అలాగే ఉందని,
కనీసం నియోజకవర్గం లోని ప్రజల సమస్యలు తెలువని లక్ష్మీ నరసింహారావు, ప్రజా నాయకుడు ఆది శ్రీనివాస్ పై అనుచిత వ్యాక్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
రాజకీయ జీవితంలో ఓడిన గెలిచిన అనునిత్యం ప్రజా సమస్యలపై పోరా డుతూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ప్రజలతో మామేకమై ఉంటూ పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఆది శ్రీనివాస్ అని మాట్లాడారు.
గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని పనుల్ని ఆది శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో టిఆర్ఎస్ చేయని పనుల్ని చేసి చూపిస్తున్నాడన్నారు.
కలికొట సూరమ్మ ప్రాజెక్టు పనులు చరవేగంగా నడుస్తున్నాయని,మోత్కురావుపేట్ – చందుర్తి రోడ్డు పనులు టెండర్లు పూర్తి అయ్యాయని, పనులు ప్రారంభం అవుతాయని,
దానిపై శిత్తశుద్దితో ఉన్నామని, వాటి గురించి మాట్లాడే నైతిక హక్కులను టిఆర్ఎస్ ఎప్పుడో కోల్పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఏఎంసీ చైర్మన్ మాదం వినోద్, ఉమ్మడి మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, నరేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్గం నర్సారెడ్డి,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

