రణం, భీమారం మండలం, ఏప్రిల్ 9:
జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని
సర్వే నంబర్ 1308 లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంతమంది సంఘాల పేరిట నిర్మాణాలు చేపట్టారు. దీంతో సోమవారం రోజున భీమారం మండల కేంద్రంలోని పలు కుల సంఘల నాయకులు, గ్రామ ప్రజలు స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలని నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.బుధవారం రోజున ఉదయం ఎమ్మార్వో రవి కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ రెవిన్యూ సిబ్బంది జెసిబితో నిర్మించిన రేకుల షెడ్లను నెలమట్టం చేశారు. ఎవరైనా మున్ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, న్యాయపరమైన కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవి కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్, ఆర్ ఐ రాజారామ్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
