రణం న్యూస్, భీమారం మండలం,
: ఏప్రిల్ 7
జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా కట్టడాలు నిర్మించారని వాటిని తొలగించి ఆస్థలంలో ప్రభుత్వం నిర్మించే వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు30 పడకల ఆసుపత్రి భవనానికిఉపయోగించుకోవాలని గ్రామస్తులు కోరారు.
భీమారం గ్రామ ప్రజలు గత కొన్ని సంవత్సరాలనుండి ప్రభుత్వ భూమిని సొంత ఖర్చుల ద్వారా సదును చేసి రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంగా ఏర్పరచుకున్నారు. ఇప్పుడు దీని స్థానంలో ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే ప్రజలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని అందువల్ల అక్రమ కట్టడాలను కూల్చివేసి వాటి స్థానంలో 30 పడకల ఆసుపత్రి , తదితర కార్యలయాలు నిర్మించుకోవడానికి స్థలం అనుకూలంగా ఉంటుందని గ్రామస్తులు, కుల సంఘాల పెద్దమనుషులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గతంలో గ్రామస్థులు చెప్పిన తహసీల్దార్ వాటిని కూల్చకపోవడం తో సోమవారం ఉదయంస్థానిక తాసిల్దార్ ఆఫీస్ ఎదుట గ్రామస్తులు అన్ని కుల సంఘాలు నాయకులు శాంతియుతంగా ధర్నా చేపట్టారు.అనంతరం స్థానిక ఎమ్మార్వో అందుబాటులోలేకపోవడంతో ఆర్ ఐ కి వినతి పత్రం అందజేశారు.
