రణం న్యూస్ డెస్క్ జులై20


ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సులో కోరుట్ల డాక్టర్ స్వీటీ అనుపరావు కు ప్రసంగించే అవకాశం లభించింది. మహిళలు పునరుత్పత్తి వ్యవస్థ పై ఆమె మాట్లాడిన అంశాలు అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వైద్యులను ఆకట్టుకున్నాయి. సుమారు 18 వేల మంది వైద్యులు పాల్గొన్న ఈ సదస్సులో కోరుట్ల సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సిటి అనుపురావుకు ప్రసంగించే అవకాశం దక్కడం విశేషం. అంతర్జాతీయ సదస్సులో కోరుట్ల డాక్టర్ కు అవకాశం దక్కడం పై జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ఐఎంఏ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.