ఆధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి
రణం న్యూస్ కోరుట్ల, ఆగస్టు 19: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికాయుతంగా ముందుకె ళ్తున్నామని కోరుట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి అన్నారు. ఉచిత మోతె బిందు శస్త్రచికిత్సలు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఓ మెరుగైన సేవా సంకల్పంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం స్థానిక రెడ్డి సంఘ భవనం, మండలంలోని చిన్న మెట్పల్లిలో నిర్వహించారు. శిబిరంలో 75 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. 22 మందికి మోతె బిందు సమస్యతో బాధపడుతున్న వారిగా గుర్తించారు. ఉచిత శస్త్ర చికిత్స కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ ద్వారా తరలించారు. ప్రతీ ఒక్కరికి రూ. 20వేల ఎల్ ఓసీ సర్జరీలు కోరుట్ల లయన్స్ క్లబ్ తరపున ఉచితంగా చేయించారు. శస్త్ర చికిత్స అనంతరం ఈ నెల 21న తిరిగి చిన్నమెట్పల్లిలో భద్రతగా తీసుకురానున్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏలేటి లక్ష్మారెడ్డి, కోశాధికారి నల్ల గంగాధర్, లయన్స్ క్లబ్ నాయకులు గుంటుక సురేష్ బాబు, అజయేంధర్ రావు, ఉషాకిరణ్, కుందారపు మహేంధర్, కేజీ క్రిష్ణ, కల్లెం గంగారెడ్డి, బెజ్జంకి శ్రీనివాస్ రావు, రాంనారాయణ,ఆదర్శ యూత్ సభ్యులు పాల్గొన్నారు.సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య చైతన్యం, అవసరమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ నిరంతరంగా కృషి చేస్తోందని లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి తెలిపారు.

