ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…
పాల్గొన్న జువ్వాడి నర్సింగరావు

రణం న్యూస్ కోరుట్ల:: ఆగస్ట్25,
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జి జి ఆర్ ఫంక్షన్ హాల్ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐఎంఏ, రెనె హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిరంజీవి, సీనియర్ వైద్యులు అనూప్ రావు, ఐఎంఏ అధ్యక్షులు రేగొండ రాజేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ సమాజ సేవలో కూడా పాత్రికేయులు పాలుపంచుకోవడం కోరుట్ల ప్రెస్ క్లబ్ కె ఆ ఘనత దక్కుందన్నారు సుమారు మూడువందల మంది కు ఉచితంగా బిపి, షుగర్, ఈసీజీ, టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువ శాతం దోమ కాటుకు గురై డెంగ్యూ జ్వరాలతో పాటు టైఫాయిడ్, మలేరియా, ఇతర సమస్యలతో ఎక్కువమంది బాధపడుతున్న సమయంలో ఇలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలను మేలు చేస్తున్న ప్రెస్ క్లబ్, ఐఎంఏ, రెన్ హాస్పిటల్ వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారరూ.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, తిరుమల గంగాధర్,సంగ లింగం, ఆడెపు మధు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, సీనియర్ పాత్రికేయులు గంగుల రాంగోపాల్, షికారి రామకృష్ణ, సలీం ఫారూఖి, ఇలియాస్ ఖాన్, చౌలా నవీన్, సామల్ల శ్రీనివాస్ , మోబిన్, సాజిద్ అలీ, రాజేందర్, మిట్టపల్లి రమణ, వంగ ప్రభాకర్ వెంకటేశ్వర రాజు లక్మన్, పరంధాంముసవీర్,బలిజా సంతోష్, చిరంజీవి, మహమ్మద్ అలీ,చిట్యాల సాయి,మర్రి సంతోష్ శంకర్, సతీష్, గంగాధర్, రాకేష్,శ్రీనివాస్, రాజారమేష్,విజయ్, జిల్లా శ్రీనివాస్,ప్రెస్ క్లబ్ పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.


