ఎస్ ఆర్ ఎస్ పి ఉపకాలువల ఆనవాళ్లు లేవు…
చెరువులు ఒర్రెలు కుంటలు ఖతం పట్టించారు….
గ్రామ పంచాయతీ కి అప్పజెప్పాల్సిన స్థలం లో సెప్టిక్ ట్యాంక్…
స.హ చట్టం ద్వారా కల్లూరు గ్రామంలో అనుమతులకు విరుద్దంగా వెంచర్ అంటూ సమాధానం
రణం న్యూస్ కోరుట్ల రూరల్ :నవంబర్18,
ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేసుకోవచ్చు.. ఎస్ అర్ ఎస్ పి ఉప కాలువలను ఆనవాళ్లు లేకుండా చేయవచ్చు…ఇవే కాలువలను పైపులైన్ గా మార్చవచ్చు.. గ్రామపంచాయతి కి అప్పజెప్పాల్సిన స్థలాన్ని సెప్టిక్ ట్యాంక్ గా మార్చవచ్చు..కుంటలను క్రేడా స్థలాలు గా తీర్చిదిద్దవచ్చు..పెద్ద పెద్ద నిర్మాణాలు సినిమా థియేటర్ లు,షాపింగ్ కాంప్లెక్స్ స్కూల్ కాంప్లెక్స్ పేరిట నిర్మాణాలు చేపట్టవచ్చు…ఎకరాలకొద్ది వరద నీటి కాలువలను కబ్జా చేయవచ్చు..వ్యవసాయభూములను చదునుచేసి ప్లాట్లుగా మార్చవచ్చు… డిటిసిపిఓ అప్రూవల్ లేకుండా…లే ఆవుట్ పర్మిషన్ లు లేకుండా కాలనీ ఏర్పాటు చేయవచ్చు…కోర్టులో కేసులున్న,కలెక్టర్ ఆదేశించినా ఎలాంటి భయం వీరికి ఉండదు.. ఈ వెంచర్ వల్ల రైతుల పంటపొలాలు నీటమునిగినా వీరికి పట్టింపు ఉండదు…
వీరి కన్ను పడితే కుంటలు కాలువలు చెరువులు ఒర్రెలు వాగులు వంకలు అన్ని కబ్జానే. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో అక్షర స్కూల్ పక్కన నిర్మాణం అవుతున్న వెంచర్ లో, ఎదురుగా నిర్మితమైన వెంచర్ లో రియల్ మాఫియా కన్నుపడి నీటి వనరులు అన్ని కబ్జాకు గురయ్యాయి. డి 36 కాలువ కనుమరుగు అయిపోయింది ఈ కాలువ స్థానంలో ఒక పైప్ లైన్ దర్శనమిస్తుంది. పాత వెంచర్ నిర్మాణంలో కల్వర్టు కు దగ్గరలో 500 గజాల ఒర్రె పై నిర్మాణాలు చేపట్టారు.ఐలపూర్ గుట్టల నుండి వచ్చే 6గజాల విస్తీర్ణం గల కాలువ ఈ ఒర్రె ప్రాంతానికి వచ్చే సరికి కనపడకుండా పోయింది.అదే విధంగా సుమారు 12 గుంటలకు పైగా విస్తీర్ణం లో గల మేడికుంట ఆనావాళ్లే లేకుండా పోయిందని గ్రామస్థులు చెపుతున్నారు.అటు వ్యవసాయ నీటి వనరులుగా ఉన్న పది కిలోమీటర్ల దూరం నుండి36 కాలువ, మేడికుంట ఇలా చెపుతూ పోతుంటే అన్ని కనపడకుండా పోయినవి.ఇవన్నీ చూస్తున్న ఇరిగేషన్ అధికారులు నిద్రావస్థలో ఉన్నారా లేక వారికి ఏమైనా ముడుపులు ముట్టాయా అని విమర్శలు తలెత్తుతున్నాయి.
నా స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారు:

కబ్జాదారులు నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశాను. విచారణ చేయాలని ఎంపిడిఓ ను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.విచారం పూర్తి అయ్యేవరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని మందాలధికారి,గ్రామ కార్యదర్శి ఇరువురిని ఆదేశించారు.విచారం పూర్తి కాకుండానే నిర్మాణాలు చేస్తున్నారు.అధికారులు కూడా ఈ రియల్టర్ల ను అడ్డుకోలేకపోతున్నారు.సమాచార హక్కు చట్టం ద్వారా సర్వే నెంబర్472,473,474,,455 లలో గ్రామ కార్యదర్శిని కోరగా ఇక్కడ అనుమతులు లేవని ఎలాంటి నిర్మాణాలు లేవని సమాధానం ఇచ్చారు. రియల్ మాఫియత్జో అధికారులు లాలూచి పడుతున్నారు.నిర్మాణాలు కళ్ళకు కట్టినట్లు కనపడన్న చర్యలు తీసుకోవడం లేదు.కలెక్టర్ ఆదేశించిన పట్టించుకోకుండా నిర్మాణాలు జరుపుతున్నారని బాధితుడు అజీమ్ ఆవేదన వెల్లగక్కాడు.

