
భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి
రణం న్యూస్ మెట్ పల్లి, ఆగస్టు 28: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వచ్చే ఆకస్మిక వరదల నేపధ్యంలో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాటి రక్షణ కు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని వినియోగారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందజేయడానికి అధికారులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి
సూచించారు. నిర్మల్, కామారెడ్డి పర్యటనలో భాగంగా మార్గమధ్యం లో మెటుపల్లి డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్షాల అత్యవసర సమీక్షా సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి ఇలాంటి విపత్తు సమయంలో రేయింబవళ్ళు కష్టపడి పనిచేయాలని, ప్రమాదాలు ముందే ఊహించి తక్షణం స్పందించాలని, అన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా హితవు పలికారు. ప్రతీ సెక్షన్ లో కాంట్రాక్టర్లను యంత్రాలు, కార్మికులతో సిద్ధంగా ఉంచాలని స్తంభాలు, సామగ్రి నిలువ ఉంచుకోవాలని అధికారులను
ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మెటుపల్లి డీఈ మధుసూదన్, ఏడీఈ దురుశెట్టి మనోహర్, ఏఈలు అమరేందర్, రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్ మరియు జేఏఓలు రాజశేఖర్, కరీం, రాజేష్, తిరుపతిరావు పాల్గొన్నారు.

