ఫిబ్రవరిలో మున్సిపల్ పోరు
రణం న్యూస్ డెస్క్:: జనవరి26
బల్దియా ఎన్నికల పోటీలకు ప్రధాన పార్టీలు సన్నదమవుతున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల నేపథ్యంలో పల్లెలో పంచాయతీ ఎన్నికలు ముగియగా.. ఇక పట్టణలలో మున్సిపల్ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంది.ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితా రావడంతో పట్టణాలలో రాజకీయాల హంగామా మొదలైంది. అయితే మున్సిపల్ పోల్ లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి.
రేపే రానున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..
పురపాలక సంఘ ఎన్నికల నగారా రేపే మోగనుంది.. జనవరి 27 మంగళవారం బల్దియా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఈ. షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపాలిటీలలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.

