రణం న్యూస్ కోరుట్ల:ఆగస్ట్10,కోరుట్ల పట్టణంలో ఆదివారం రథాల పంపు మున్నూరు కాపు సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షులుగా గుర్రాల విజయ్. ఉపాధ్యక్షులుగా యాటం అరుణ్. ప్రధాన కార్యదర్శిగా పుప్పాల నాగరాజు. కోశాధికారిగా గాలి శేఖర్. ఆర్గనైజింగ్ సెక్రటరీగా యతిరాజం మహేష్. సంయుక్త కార్యదర్శులుగా గోపు శేఖర్. సాగ గంగారెడ్డి,కార్యవర్గ సభ్యులుగా సాగ రాజేష్ ,కోసరి మధు, సోవినవేనీ స్వామి గుర్రాల ప్రశాంత్ లను సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నుక కాబడిన ఆధ్యక్షులు గుర్రాల విజయ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సంఘ సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంఘము యొక్క అభివృద్ధితోపాటు పట్టణంలోని పలు సేవా కార్యక్రమం చేపడతానని అన్నారు.

