ఇది కోరుట్ల మున్సిపల్ అధికారుల తీరు…
నిత్యం జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరుగుతున్న… ఇంత నిర్లక్ష్యమా…
అధికారుల నాయకుల ముందే జాతీయ చిహ్నానికి అవమానం…
జాతీయ చిహ్నాన్ని అవమానించిన అధికారిపై చర్యలుంటాయా ఉండవా…
రణం న్యూస్ కోరుట్ల: జనవరి 30
ఈ కార్యాలయానికి పట్టణ ప్రథమ అధికారి కనుసన్నల్లోనే నిర్వహించబడుతుంది.ఈ కార్యాలయానికి రోజు వందల మంది వస్తూ పోతుంటారు.పట్టణంలోని నాయకులు ఈ ఆఫీస్ చుట్టే తచ్చాడుతుంటారు.ఎన్నికల వేళ జిల్లా కలెక్టర్ స్థాయి మొదలుకొని,సబ్ కలెక్టర్ స్థాయి ఆర్డీఓ స్థాయి అధికారులు ప్రతి పర్యవేక్షణకు వచ్చే ప్రదేశం. ఇదే కోరుట్ల పురపాలక సంఘం.ఇక్కడే జాతీయ చిహ్నం కు అవమానం జరిగింది.మూడు సింహాల గద్దెను అశోకచక్రం చిహ్నం ను కూల్చి వేసి పక్కన పడేశారు.ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కు నిదర్శనంగా నిలిచింది.పుర ప్రముఖుల సమక్షంలో ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారుల,నిఘా వర్గాల సాక్షిగా అందరికి తెలిసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.మేధావుల అధికారుల దృష్టి పడటంతో కూల్చి పడేసిన మూడు సింహాల గద్దెను ఎక్కడ పరువు పోతుందో అనిపక్కన ఉన్న మూలకు పడేసి ఓ నల్లటి కవర్ కప్పారు.. ఈ జాతీయ చిహ్నాన్ని అవమాన పరిచిన అధికారుల పై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి.. దీనికి బాధ్యత వహించాల్సిన అధికారి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే చర్యల్లో జాప్యం ఎందుకు.ఇంతకు ఈ అధికారి పై చర్యలుంటాయా ఉండవా..

దేశ గౌరవానికి ప్రతీక అయిన భారత జాతీయ చిహ్నానికి అవమానం జరగడం అందరూ తేలిగ్గా పరిగణించడం విషయం,
జాతీయ చిహ్నం భారత స్వాతంత్ర్యం, ఐక్యత, రాజ్యాంగ విలువలను సూచికగా నిలుస్తుందని ఈ ఘటన పై కఠిన చర్యలు తీసుకోవాలని మేధావులు స్వచ్చంద కార్యకర్తల నుండి వస్తున్న బలమైన వాదన. వెల్లువెత్తుతున్నాయి.
చట్ట ప్రకారం జాతీయ చిహ్నానికి అవమానం శిక్షార్హమైన నేరం ఇది తెలిసిన విషయమే.. అధికారులు స్పష్టం చేశారు.బాద్యులపై పోలీసులు కేసు నమోదు చేయాలి.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.


