కోరుట్లలో అటకెక్కిన శానిటేషన్…
చెత్త తొలగించడానికి వార్డు పరిధి పంచాయతీ..

రణం న్యూస్ కోరుట్ల: అక్టోబర్ 04
కోరుట్ల పురపాలక సంఘం స్వచ్ఛ కోరుట్ల అవార్డులను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొంది అందరికి ఆదర్శంగా నిలిచింది.కానీ ఇదే బల్దియా పరిధిలో పట్టణ నడిబొడ్డులో శానిటేషన్ సిబ్బంది రాక చెత్తతో నిండిపోయింది. వివరాల్లోకి వెళితే సంతోషిమాత వీధి 17 వార్డులో గత పధిరోజులుగా తడిపొడి చెత్తను సేకరించే వాహనాలు రాక దుర్వాసనతో కంపుకొడుతుంది.మున్సిపల్ వాహనాలను ఈ చెత్త చెదారాన్ని తొలిగించమని కోరితే మా పరిధి కాదు అని ఒకరు.. మరో వాహనాన్ని అడిగితే మా పరిధి కాదంటూ వెళ్లిపోతున్నారని వార్డు ప్రజలు చెబుతున్నారు.17వ వార్డు పరిధి అని,28వార్డు పరిధి అంటూ అది మా డ్యూటీ కాదంటూ చెత్త సేకరించాకుండానే వెళ్తున్నారు.గత పది రోజులుగా దుర్గంధం దుర్వాసనతో బాధ పడుతున్నామని దోమలబెడద ఎక్కువైందని వార్డు ప్రజలు చెప్పుకొస్తున్నారు.ప్రజారోగ్యం పై శ్రద్ధచూపాల్సిన సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలిపిన లాభం లేదని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు.

