
రణం న్యూస్, మేడిపల్లి మండలం, ఆగస్టు 7:
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నలువాల భూమయ్య గురువారం రోజున బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తొగరి లక్ష్మీపతి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా తొగరి లక్ష్మీపతి నలువాల భూమయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నలవాల భూమయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానం నచ్చి, నరేంద్ర మోడీ, బండి సంజయ్ గారిపై అభిమానంతో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, రాబోయే రోజులలో బిజెపి పార్టీ బలోపేతానికి, తన వంతు కృషి చేస్తారని అన్నాడు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షుడు నిమ్మ రాజ్ కుమార్, ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు రాచర్ల హనుమాన్లు, మార్గం గంగరాజo, శ్రీనివాస్, గణేష్, చిలువేరు తిరుపతి, సంధిల గంగాధర్, జవ్వాజి రాజo, యాగండ్ల మారుతి, కాచర్ల ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

