నమ్మితే నట్టేట ముంచారు…దోస్తానాతో నయవంచన
స్నేహం ముసుగులో మాజీ సైనికోద్యోగికి ద్రోహం
పురపాలక సంఘం ముందు మౌన దీక్ష
(రణం న్యూస్ కోరుట్ల మే16)


అతనొక పదవి విరమణ పొందిన సైనిక ఉద్యోగి..స్నేహం ముసుగులో చిననాటి స్నేహితుడు తనకు ద్రోహం తలపెట్టాడని వాపోతున్నాడు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వాసం వేదవ్యాస్.వివరాల్లోకి వెళితే మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తోపారపు జగదీశ్వర్ అతని స్నేహితుడు ఒడ్నాల రామారావు కలిసి తనను బోల్తా కొట్టించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 20 ఏళ్లుగా దేశసేవలో తరించి జన్మభూమికి వచ్చిన తనను ముప్పు తిప్పలు పెడుతున్నారని బోరుమన్నాడు.20 ఏళ్ల తన కష్టార్జితం రిటైర్మెంట్ బెన్ఫిట్స్ 5లక్షల రూపాయలు తీసుకుని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తాడంటూ తనను నమ్మించారని… కోట్లల్లో వెంచర్లు ఉంటాయని చెప్పి తనకుద్రోహంతలపెట్టాడనికన్నీటిపర్యంతమయ్యాడు.చివరికి విసిగివేసారి తాను మనోవేదనకు గురయినట్లు తెలిపాడు.తోపారపు జగదీశ్వర్, ఒడ్నాల రామారావు తీరుకు తాను తీవ్ర మనోవేదనకు గురికావడంతో ఆరోగ్య పరిస్థితి దెబ్బతిందని వాపోయాడు. మెరుగైన వైద్యం కోసండబ్బులుఅవసరముందనిఎంతజెప్పినావినిపించుకోవడం లేదని… తప్పనిపరిస్థితుల్లో తోపారపు జగదీశ్వర్ పనిచేసే మున్సిపల్ కార్యాలయం ఎదుట మౌనదీక్షచేయాల్సినదుస్థితివచ్చిందనికన్నీటిపర్యంతమయ్యాడు. .జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అనంతరం కార్యాలయంలోవినతిపత్రంసమర్పించి వారు ఇచ్చిన చెక్కులు, బాండ్ పేపర్, తదితర వాటితో చట్ట పరిధిలో న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు. మాజీ సైనికోద్యోగినైనా నన్ను ఇంతలా ఇబ్బందులకు గురిచేస్తున్న వీరిద్దరి వ్యవహారాన్ని గౌరవ న్యాయస్థానాలు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేయాలని వేడుకుంటున్నాడు.
